Sunday, March 15, 2026
HomeTrending Newsఏమీ చేయలేరు: వేణుగోపాల కృష్ణ

ఏమీ చేయలేరు: వేణుగోపాల కృష్ణ

No Dare: సిఎం వైఎస్  జగన్ కు జన బలం ఉందని, ఎంతమంది కలిసి వచ్చినా ఏమీ చేయలేరని రాష్ట్ర బిసె సంక్షేమ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ  స్పష్టం చేశారు. ఈ దేశ రాజకీయాల్లోనే అత్యంత స్వార్ధ పరుడు చంద్రబాబు అని, అలాంటి వ్యక్తి త్యాగాలకు సిద్ధపదతాడా అని అనుమానం వ్యక్తం చేశారు.

సిఎం జగన్ ప్రజలకు చేస్తున్న మంచిని అడ్డుకునేందుకు చంద్రబాబు మరికొంతమందితో కలిసి కుట్ర చేస్తున్నారని, పవన్ ను మరోసారి వాడుకోవడానికి ఎత్తులు  వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడూ పొత్తులతోనే గెలిచారని ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఆయనకు లేదని చెల్లుబోయిన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పడం లేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెబుతున్నారని గుర్తు చేశారు. మొత్తం మీద వైసీపీ కున్న బలాన్ని వారు గుర్తించారని ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular