Sunday, September 22, 2024
HomeTrending NewsPeddireddy: యాత్ర చేసే హక్కు బాబుకు లేదు: పెద్దిరెడ్డి

Peddireddy: యాత్ర చేసే హక్కు బాబుకు లేదు: పెద్దిరెడ్డి

చంద్రబాబుకు కొత్తగా రాయలసీమపై ప్రేమ పుట్టుకు వచ్చిందని రాష్ట్ర విద్యుత్, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. చంద్రబాబు సీమ ప్రాజెక్టుల సందర్శనపై పెద్దిరెడ్డి  స్పందించారు. అసలు బాబుకు సొంత ప్రాంతంపై ఏమాత్రం మమకారం దన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

గతంలో ఈ ప్రాంతంలో నెలకొన్న సాగునీటి సమస్యతో ఇక్కడి ప్రజలు  బెంగుళూరు లాంటి ప్రాంతాలకు వలస వెళ్లి చిన్న చిన్న పనులు చేసుకొని జీవించారని చెప్పారు. జగన్ సిఎం కాగానే ఈ ప్రాంతానికి మూడు రిజర్వాయర్ లు మంజూరు చేసి, హంద్రీ నీవా ద్వారా నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించి పనులు మొదలు పెట్టారన్నారు.  చంద్రబాబు ఈ రిజర్వాయర్ లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టులకు వెళ్లి స్టే తెచ్చారని పెద్దిరెడ్డి విమర్శించారు.  రాయలసీమపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్దిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. 14 ఏళ్ళ పాటు సిఎం గా  ఉన్న చంద్రబాబు కనీసం సొంత నియోజకవర్గాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

హంద్రీనీవా ప్రాజెక్టును 95శాతం పూర్తి చేస్తే మిగిలిన ఐదు శాతం బాబు పూర్తి చేయలేకపోయారని, కుప్పం నియోజకవర్గానికి హంద్రీ నీవా నీరు వస్తుందంటే అది జగన్ ఘనతేనని పేర్కొన్నారు. మదనపల్లి వరకూ వచ్చిన హంద్రీ నీటిని కుప్పం కు తెచ్చుకోలేకపోయిన బాబుకు  ప్రాజెక్టుల యాత్ర చేసే హక్కు లేదన్నారు.  వైఎస్ఆర్, బాబు హయంలో సీమ ప్రాజెక్టులపై జరిగిన మేలుపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్