Friday, March 13, 2026
HomeTrending News#NTRCentenary: బాబు ఇంట్లో రజనీకాంత్ కు తేనీటి విందు

#NTRCentenary: బాబు ఇంట్లో రజనీకాంత్ కు తేనీటి విందు

దక్షిణాది సూపర్ స్టార్, తమిళ తలైవా రజనీకాంత్ నేడు ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కాసేపట్లో విజయవాడలోని అనుమోలు గార్డెన్స్ లో జరిగే ఎన్టీఆర్ అసెంబ్లీ, చారిత్రిక ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనేందుకు రజనీకాంత్ విజయవాడ చేరుకున్నారు. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయంలో హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. సాయంత్రం రజనీ కాంత్ ని చంద్రబాబు తేనీటి విందుకు ఆహ్వానించారు.  ఉండవల్లి నివాసంలో  ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, పలువురు టిడిపి నేతలు రజనీకాంత్ ను కలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular