Thursday, March 19, 2026
HomeTrending NewsKannababu: విజన్ లేదు.. విస్తరాకుల కట్టా లేదు

Kannababu: విజన్ లేదు.. విస్తరాకుల కట్టా లేదు

చంద్రబాబు తానేదో సత్యహరిశ్చంద్రుడిలా, నీతి మంతుడిలా, ప్రపంచానికి పాఠాలు నేర్పుతున్న గురువులా బిల్డప్ లు ఇస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు.  మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న సమయంలో  రోజుకో వేషం.. పూటకో మాట మాట్లాడుకుంటూ మళ్ళీ ప్రజల్ని మభ్య పెట్టే కార్యక్రమం మొదలు పెట్టారని. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి,  ప్రజలను తన మాయలో పడేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. పేదరిక నిర్మూలన కోసం ఈ వృద్ధ నాయకుడు కొత్త విజన్ అంటున్నారని, పేదల గురించి అసలు చంద్రబాబు మాట్లాడటమే హాస్యాస్పదమన్నారు,.

ప్రధాని మోడీ ప్రారంభించిన 2047 విజన్ కు తాను మద్దతిచ్చానని బాబు చెబుతున్నారని, పేదల సంక్షేమం కేవలం నాలుగేళ్ళలోనే.. రూ. 2 లక్షల కోట్లకు పైగా సిఎం జగన్ ఖర్చు చేస్తే ‘నొక్కుడు-బొక్కుడు’ అంటూ హేళన చేస్తున్న చంద్రబాబు పేదల గురించి మాట్లాడటమేమిటని ప్రశ్నించారు.

మోడీ కోసం తాను రెడీగా ఉన్నానని, ఆయన కరుణ కోసం ఎదురు చూస్తున్నానన్న విషయాన్ని నిన్నటి రిపబ్లిక్ టివి ఇంటర్వ్యూ ద్వారా చంద్రబాబు వేడుకున్నారని కన్నబాబు వ్యంగ్యాస్త్రం  విసిరారు. మోడీ కనికరం కోసం ఎలా మోకరిల్లుతున్నాడో బాబు చెప్పారన్నారు.వ  రాష్ట్రానికి కాంగ్రెస్ కన్నా పెద్ద ద్రోహి మోడి అని, మోడీ కన్నా పెద్ద ద్రోహి ఎవరూ ఉండరంటూ గతంలో ఇదే చంద్రబాబుమాట్లాడిన విషయాన్ని కన్నబాబు గుర్తు చేశారు.  ఇదంతా మోడీకి కన్ను కొట్టి, ఆయనకు భజన చేసే కార్యక్రమం తప్ప మరొకటి కాదన్నారు.  అనుభవం ఉందని 2014లో అధికారం అప్పగిస్తే.. ఒక్క పర్మినెంటు బిల్డింగు కట్టలేని వాడు, శివ రామకృష్ణన్ కమిటీ వద్దన్న చోటే రాజధానిని ప్రకటించి.. ఏమీ చేయలేనివాడు చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు.  చంద్రబాబుకు విజన్ లేదు.. విస్తరాకుల కట్టా లేదంటూ మండిపడ్డారు.  చంద్రబాబుకు భజన చేసే నారాయణ లాంటి కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడాలన్నారు. మళ్ళీ అధికారంలోకి రావడమే బాబు ముందున్న ఏకైక విజన్ అంటూ కన్నబాబు వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular