Sunday, January 19, 2025
HomeTrending Newsబాబుకు అమావాస్య, రాష్ట్రానికి పొర్ణమి

బాబుకు అమావాస్య, రాష్ట్రానికి పొర్ణమి

Babu Must Retire From Politics Vijayasai Advises :

కుప్పం ఓటమితో చంద్రబాబు రాజకీయ జీవితానికి శుభంకార్డు పడిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీపార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. బాబుకు నేడు అమావాస్య అయితే.. రాష్ట్రానికి పౌర్ణమి అని అభివర్ణించారు. తిరుపతి ఎన్నికల సందర్భంగా  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పినట్టుగా… చివరికి కుప్పంలో కూడా పార్టీ లేదు, బొక్కా లేదు అన్నట్లుగా తయారైందని విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు.

సొంత నియోజకవర్గం ప్రజలు తిరస్కరించినా రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే… అది చంద్రబాబు ఇష్టమని, 72 ఏళ్ళ చంద్రబాబుకు ఉన్న బాధంతా తన కొడుకు అక్కరకు రాలేదన్నదేనని విజయసాయి పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో లోకేశ్‌ ను, 2021  ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు.  కాలర్ ఎగరేసి బూతులు తిడితే ఓట్లు రావని, ప్రజాప్రయోజనాలు కాపాడితే ఓట్లేస్తారని లోకేష్ ను ఉద్దేశించి విజయసాయి అన్నారు.

తమ పార్టీ విజయాలకు సిఎం జగన్ పాలనే కారణమని, కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడలేదని, మనిషిని మనిషిగా చూస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇంతటి ఘ‌న విజ‌యాన్ని అందించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Must Read : బాబు, లోకేష్ లకు పెద్దిరెడ్డి వార్నింగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్