Friday, September 20, 2024
HomeTrending NewsDharmana: డిసెంబర్ లో వంశధార జాతికి అంకితం: ధర్మాన

Dharmana: డిసెంబర్ లో వంశధార జాతికి అంకితం: ధర్మాన

డిసెంబర్ లో వంశధార ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావు వెల్లడించారు. ఇప్పటికే 71శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన  పూర్తి చేస్తామని  స్పష్టం చేశారు.   తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు, ఇప్పుడు యాత్రలు చేస్తున్నారని ధర్మాన ఎద్దేవా చేశారు. ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రాజెక్టులపై ఇన్వెస్ట్ మెంట్ దండుగ అని చంద్రబాబు గతంలో చెప్పేవారని, ఆయన హయంలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది డా. వైఎస్సార్ అని పేర్కొన్నారు.

ఉద్దానం సమస్య పరిష్కారానికి బాబు ఏమీ చేయలేదని, కిడ్నీ వ్యాధుల నిర్మూలనకు  తమ ప్రభుత్వం వంశధార నుంచి ఉద్దానం కు మంచి నీరు అందించేలా ప్రణాళికలు రూపొందించిందని, దీనికోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని  వివరించారు.  ఉద్దానంలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు శంఖుస్థాపన చేస్తున్నారని, దానికి కూడా త్వరలో ప్రారంభోత్సవం చేయబోతున్నారని ధర్మాన వెల్లడించారు.

14 ఏళ్ళు సిఎంగా పని చేసిన వ్యక్తి ఇప్పుడు వచ్చి ప్రాజెక్టులు పూర్తి కాలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ నాలుగేళ్ళలో రెండేళ్ళు కరోనాతో పోయిందన్నారు.  ఈ ప్రాంతంలో ఉన్న వెనుకబడిన తరగతులు టిడిపికి అండగా నిలిచినా వారికి ఇప్పటి వరకూ ఏమీ చేయలేకపోయారని ఆరోపించారు.  వంశధార ప్రాజెక్టు కోసం నేరడి బ్యారేజ్ వద్ద ఓడిశాతో ఉన్న వివాదాన్ని సిఎం జగన్ స్వయంగా భువనేశ్వర్ వెళ్లి అక్కడి సిఎం తో చర్చలు జరిపి పరిష్కారానికి కృషి చేశారన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్