Tuesday, March 10, 2026
HomeTrending Newsఐఏఎస్ పదోన్నతులు ఆపండి: యూపీపీఎస్సీ కి బాబు లేఖ

ఐఏఎస్ పదోన్నతులు ఆపండి: యూపీపీఎస్సీ కి బాబు లేఖ

స్టేట్ క్యాడర్ సర్వీసెస్ అధికారులకు ఐఏఎస్ పదోన్నతులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చేపట్టటం సరికాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.  ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఐఏఎస్ కన్ఫర్మెంట్​ను వాయిదా వేయాలంటూ  యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనికు  బాబు లేఖ రాశారు. మోడల్ ప్రవర్తనా నియమావళి ఉన్నప్పుడు ఐఏఎస్ జాతీయ కేడర్ అధికారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించడం సరికాదన్నారు.

కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేయాలని లేఖలో చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని వారికే పదోన్నతులు పరిమితం చేశారని, జాబితా తయారీలో పారదర్శకత లేదని ఆరోపించారు. జాబితాను పునఃపరిశీలించి ఎంపిక ప్రక్రియను కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేవరకూ నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular