Sunday, January 19, 2025
HomeTrending NewsBabu Tour: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు

Babu Tour: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండ్రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు.  ఆయనతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా హస్తినకు వచ్చారు.  ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎన్టీఆర్ 100 రూపాయల నాణేన్ని రేపు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.

అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆంధ్ర ప్రదేశ్  ఓవర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని అధికార పార్టీకి అనుకూలంగా లేరన్న అనుమానం ఉన్నవారి ఓట్లను తొలగిస్తున్నారని ఫిర్యాదు చేయనున్నారు. గత వారమే దీనికి సంబంధించిన పలు ఆధారాలను  ఎన్నికల సంఘానికి పంపామని టిడిపి వర్గాలు పేర్కొన్నాయి.

ఢిల్లీ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఎంపీలు రఘురామ కృష్ణంరాజు, కనకమేడల రవీంద్ర కుమార్, ఇతర నేతలు స్వాగతం పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్