Wednesday, May 7, 2025
HomeTrending Newsహక్కులు హరించారు: బాబు విమర్శ

హక్కులు హరించారు: బాబు విమర్శ

Panchayat: గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులను  జగన్ ప్రభుత్వం కాలరాస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గ్రామస్థాయిలో సమాంతర వ్యవస్థలు ఏర్పాటు చేసి, సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి వేసి, వారి హక్కులను హరిస్తున్నారని, ఇలా చేసే అధికారం జగన్ కు ఎవరిచ్చారని బాబు ప్రశ్నించారు.  మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర  కార్యాలయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన రాయలసీమ ప్రాంత సర్పంచ్ ల అవగాహనా సదస్సు జరిగింది. ఈ సదస్సులో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఇతర పార్టీల వారు పోటీ చేయకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారని, ఎవరూ పోటీ చేయకూడదంటూ వైసీపీ నేతలు హుకుం జారీ చేశారని బాబు విమర్శించారు. ఎన్నికల్లో  ఎన్నో అరాచకాలు చేసి చాలా చోట్ల ఎకగ్రీవాలు చేసుకున్నారని, ఎన్ని ఒత్తిళ్ళు చేసినా తట్టుకుని కొంతమంది  టిడిపి కార్యకర్య్తలు ఎదురొడ్డి నిలిచారని అంటూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలిచి గెలిచిన పార్టీ సానుభూతిపరులైన సర్పంచ్ లకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘వైసీపీ అరాచకాలను తట్టుకుని గెలిచిన మీది నిజమైన గెలుపు మీది’ అని బాబు వ్యాఖ్యానించారు.

14,15వ ఆర్ధిక సంఘం నిధులను దారి మళ్ళించారని, పంచాయతీల ఖాతాల నుంచి నిధులు డ్రా చేసుకోవడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. తమ హక్కులకోసం సర్పంచ్ లు పోరాటం చేయాలని, వారికి టిడిపి అండగా ఉంటుందని  భరోసా ఇచ్చారు.

Also Read : పంచాయతీల ప్రోత్సాహకాలు విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్