Wednesday, January 22, 2025
HomeTrending Newsబాబు ప్రమాణ ముహూర్తం బాగుంది: స్వరూపానంద

బాబు ప్రమాణ ముహూర్తం బాగుంది: స్వరూపానంద

చంద్రబాబు అంటే చాలా గౌరవం ఉందని, ఆయన ఎంతో సీనియర్ నేత అని విశాఖ శారదా పీఠం అధిపతి శ్రీ స్వరూపనందేంద్ర స్వామి అన్నారు. బాబు ఆరోగ్యం బాగుండాలని, ఈసారైనా దేవాలయాల పాలన బాగుండాలని ఆకాంక్షించారు.  చినముసిరివాడ లోని పీఠం ప్రాంగణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. స్వాములం, పీఠాదిపతులమని.. ధర్మం కోసమే పోరాడతామని… తాను ఎవరికో భయపడి ఈ ప్రెస్ మీట్ పెట్టడం లేదని, కొంతమంది తొందరపాటుతో  తప్పుడు అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండేందుకే ఈ మాటలు చెబుతున్నానని వివరించారు.

గతంలో కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వాళ్ళం తప్ప సంపాదన కోసం ఉన్న పీఠం మాది కాదని స్పష్టం చేశారు.  చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉన్ని, బాబు ప్రమాణ స్వీకార ముహూర్తం బలమైనదని చెప్పారు. కేంద్రతో ఉండే సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పాలించగలరని ఆశిస్తున్నామని,  ప్రజలకు మేలు గలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని ఆశీర్వదించారు.

అమరావతి లో కూడా శారదా పీఠం నిర్మిస్తామని,  ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఉంటాయన్నారు.  త్వరలోనే చాతుర్మాస పూజలకోసం రుషికేశ్ వెళ్తున్నానని,  అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నామన్నారు.  తాను హైదరాబాద్ లోని శారదా పీఠంలో స్థిరపడాలని అనుకుంటున్నట్లు తన మనోగతాన్ని తెలిపారు.

తనకు అత్యంత ఆత్మీయుడు ఆయిన ఎర్రన్నాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి కావడం సంతోషంగా ఉందని,  అమ్మ వారి కృప చేత మోడీ మూడో సారి ప్రమాణస్వీకారం చేయడం ఆనందం కలిగించిందని స్వరూపానంద అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్