Wednesday, February 26, 2025
HomeTrending NewsAlluri: అమరావతిలో అల్లూరి మెమోరియల్: చంద్రబాబు

Alluri: అమరావతిలో అల్లూరి మెమోరియల్: చంద్రబాబు

తాము అధికారంలోకి రాగానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో  అల్లూరి 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు జరిగాయి. దీనికి బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు పార్టీల నేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ అల్లూరి జయంతిని కేంద్రం గుర్తించినా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు.

అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహించాలని 2014 లో తాము ఉత్తర్వులు ఇచ్చామని, కానీ ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదని అన్నారు, తాము వచ్చిన తరువాత అమరావతిలో అల్లూరి మెమోరియల్ ఏర్పాటు చేస్తామన్నారు. పార్లమెంట్ లోఅల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.  ఆయన దేశానికి చేసిన సేవలను, త్యాగాన్ని, పౌరుషాన్ని భావితరాలకు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు,  బిజెపి నేత విష్ణు కుమార్ రాజు, సిపిఐ నేత రామకృష్ణ, జన సేన నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్