Sunday, January 19, 2025
HomeTrending Newsవరద ప్రాంతాలకు బాబు

వరద ప్రాంతాలకు బాబు

Babu To Visit Flood Affected Districts :

ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారంనుంచి రెండ్రోజులపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం కడప, మధ్యాహ్నం తిరుపతిలో అయన వరద పీడిత ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుంటారు. నవంబర్ 24, బుధవారం నాడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సాగనుంది.

శనివారం అసెంబ్లీలో జరిగిన సంఘటనలతో తీవ్ర మనస్తాపం చెందిన చంద్రబాబు ఇలాంటి కౌరవ సభలో ఉండలేనని, ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, సిఎంగా మాత్రమే తిరిగి సభలోకి వస్తానని శపథం చేసి వాకౌట్ చేశారు. తన కుటుంబ సభ్యులపై అధికార వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలతో భావోద్వేగానికి గురై,  మీడియా సమావేశంలో వాటిని తలచుకొని విలపించిన సంగతి తెలిసిందే. అనంతరం శనివారం బాబు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు.

ఇకపై ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్న చంద్రబాబు ఇటీవలి వరదలకు తీవ్రంగా నష్టపోయిన కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. మరోవైపు టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అసెంబ్లీ, మండలి సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. వారు కూడా తమ తమ నియోజకవర్గాలకు వెళ్ళినట్లు తెలుస్తోంది.

Must Read : నోరు అదుపులో పెట్టుకోండి : బాలయ్య

RELATED ARTICLES

Most Popular

న్యూస్