Thursday, March 12, 2026
HomeTrending Newsసాటి మనిషి శ్రేయస్సు ఆకాంక్షించడమే క్రైస్తవం: బాబు

సాటి మనిషి శ్రేయస్సు ఆకాంక్షించడమే క్రైస్తవం: బాబు

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.  “సమాజంలో శాంతి కోసం పాటుపడటం, సాటి మనిషి శ్రేయస్సు కోసం కృషి చేయడమే అసలైన క్రైస్తవం. క్రీస్తు రాజ్యంలో సేవ తప్ప మరి దేనికీ చోటు లేదు. క్రీస్తు జన్మదినం సర్వ మానవాళికి పవిత్ర దినం. శాంతి శకానికి ఆరంభ దినం. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు” అంటూ సందేశం ఇచ్చారు.

కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని  చంద్రబాబు పేర్కొన్నారు. తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారన్నారు. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్‌ బాటలు వేశారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular