Sunday, September 8, 2024
HomeసినిమాVaishnavi Chaitanya: డీజే టిల్లు తో రొమాన్స్ చేయనున్న బేబీ హీరోయిన్

Vaishnavi Chaitanya: డీజే టిల్లు తో రొమాన్స్ చేయనున్న బేబీ హీరోయిన్

సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం మల్లిక్ రామ్ దర్శకత్వంలో ‘డీజే టిల్లు స్క్వేర్’ మూవీ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 6న విడుదల కానుంది. అయితే దీని అనంతరం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక మూవీ చేయడానికి సిద్ధం అయ్యారు సిద్దు జొన్నలగడ్డ.

ఈ ఏడాది వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసిన చిన్న సినిమాలలో ‘బేబి’ ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఒక్క సినిమాతో యూత్ లో ఆమె క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది.వైష్ణవికి ఇక వరుస అవకాశాలు రావడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. యంగ్ హీరోల జోడీగా ఆమె వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతుందనే టాక్ బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపిస్తోంది. తాజాగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ప్రాజెక్టు విషయంలోను ఆమె పేరు తెరపైకి వచ్చింది.

సిద్ధూ జొన్నలగడ్డతో భాస్కర్ ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం వైష్ణవిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా నుంచి, త్వరలో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్