Saturday, April 26, 2025
Homeసినిమా'బేబీ' సినిమా డబ్బింగ్ ప్రారంభం

‘బేబీ’ సినిమా డబ్బింగ్ ప్రారంభం

యువ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా ‘బేబీ’. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకం పై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ విభిన్న క‌థా చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు. త్వరలో సినిమా విడుదలకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మ‌రి.. బేబీ చిత్రం ఎంత వ‌ర‌కు మెప్పిస్తుందో.. ఏ స్ధాయి విజ‌యం సాధిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్