Sunday, January 19, 2025
Homeసినిమా'బేబీ' మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

‘బేబీ’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

Wall writing poster: న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘బేబీ‘. దర్శకుడు సాయి రాజేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘బేబీ’ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ‘బేబీ’ ఒక న్యాచురల్, ఇన్నోవేటివ్ లవ్ స్టోరి. ఈ సినిమా ఫ్లేవర్  ను రిఫ్లెక్ట్ చేస్తూ ఒక కొత్త తరహా పోస్టర్ ను టీమ్ విడుదల చేసింది.

గోడల మీద రాతలు మనకు బాగా తెలిసినవే. ఈ రాతల్లో ప్రేమ గురించి అనేక స్లోగన్స్, పోయెట్రీ కనిపిస్తుంటుంది. ప్రేమించుకానీ నటించకు రా, మనసులో ఉంచుకో, మళ్లీ వస్తా…ఇలాంటి కొటేషన్స్ లవర్స్ ఎక్స్ ప్రెషన్స్ ను చూపిస్తాయి. ఇలాంటి గోడ మీద రాతలతో పోస్టర్ డిజైన్ చేసి సంక్రాంతి విషెస్ తెలిపింది ‘బేబీ’ టీమ్. సినిమా స్టోరీలాగే ఈ పోస్టర్ కూడా విభిన్నంగా ఉండి ఆకట్టుకుంటోంది.

విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా లాంటి సూపర్ హిట్ సినిమా నిర్మించిన ఎస్. కె. ఎన్ ‘బేబీ’ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్త సంస్థ మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ‘బేబీ’ సినిమా నిర్మితమవుతోంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్