Sunday, January 19, 2025
Homeసినిమా'ఆహా' లో 'బేబి' స్ట్రీమింగ్‌

‘ఆహా’ లో ‘బేబి’ స్ట్రీమింగ్‌

తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ దూసుకెళ్తోన్నఏకైక తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ఇప్ప‌టికే ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌, షోస్‌, వెబ్ సిరీస్‌ల‌ను అందించిన ఆహా తాజాగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ‘బేబి’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి రెడీ అయ్యింది. ఈ సినిమా ఆహాలో ఆగ‌స్ట్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే క‌ల్ట్ క్లాసిక్‌గా తెలుగు ప్రేక్ష‌కుల ప్రేమాభిమానాల పొందిన ‘బేబి’ చిత్రం త్వ‌ర‌లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేర‌టానికి ప‌రుగులు తీస్తోంది. ఈ నేప‌థ్యంలో రూ.899లను చెల్లించిన త‌న గోల్డ్ ప్యాక్ స‌బ్ స్క్రైబ‌ర్స్‌కు మ‌రో అపూర్వ అవ‌కాశాన్ని అందించింది ఆహా.

ఈ సంద‌ర్భంగా ఆహా వైస్ ప్రెసిడెంట్‌, బిజినెస్ స్ట్రాట‌జీ,  ఎస్‌వీఓడీ హెడ్ రాకేష్ సీకే మాట్లాడుతూ  ‘‘ప్రేక్షకులకు అత్యంత నాణ్యతతో కూడిన నిరంతర వినోదాన్ని అందించాలనే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. వారికి మరింత స్థిరమైన వినోదాన్ని మరిన్ని ఫీచర్స్ కలిపి అందించాలనే ఉద్దేశంతో సబ్ స్క్రిప్షన్ ప్యాక్ ధరలలో కొన్ని మార్పులు చేయటం జరిగింది”

సామజవరగమన, హిడింబ వంటి సినిమాలతో ఆహా తన యూజర్లను అలరిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లెటెస్ట్ సెన్సేషనల్ కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి సినిమా ఆహాలో అందుబాటులోకి రానుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబి సినిమాను ఎస్ కే ఎన్ నిర్మించగా.. సాయి రాజేష్ దర్శకత్వం వహించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్