Friday, November 22, 2024
HomeTrending Newsహృదయపూర్వక స్వాగతం: కాలిఫోర్నియా కోర్టులో తెలుగు 'జయ'

హృదయపూర్వక స్వాగతం: కాలిఫోర్నియా కోర్టులో తెలుగు ‘జయ’

తెలుగు ఆడపడుచు, విజయవాడకు చెందిన బాడిగ జయ ‘ మీ అందరికీ హృదయ పూర్వక స్వాగతం’ అంటూ తన ప్రమాణ స్వీకారానికి హాజరైన అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ‘ అసతోమా సద్గమయ’ గీతాన్ని చదువుతూ దాన్ని భావాన్ని ఇంగ్లీష్ లో ఆహూతులకు వివరిస్తూ ‘ఓం శాంతి శాంతి: శాంతి:’ అంటూ తన ప్రమాణాన్ని ముగించారు.

మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కూతురు జయ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో
సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులైన సంగతి తెలిసిందే. ఆమె తన పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో జన్మించిన జయ బాడిగ హైదరాబాదులో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, పొలిటికల్ సైన్సు సబ్జెక్టులతో బీఏ చేశారు. బోస్టన్ విశ్వవిద్యా లయంలో ఉన్నతవిద్య అభ్యసించిన అనంతరం శాంటాక్లారా వర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా స్వాకరించారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ ఎగ్జామ్‌లో అర్హత సాధించి.. అమెరికాలో పదేళ్లకు పైగా న్యాయవాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్ కొనసాగించారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అటార్నీగా, గవర్నర్ కార్యాలయ అత్యవసర సేవల విభాగంలోనూ గతంలో పనిచేశారు. 2022 నుంచి ఇదే కోర్టులో కమిషనర్ గా ఆమె పనిచేస్తున్నారు. ఫ్యామిలీ లా నిపుణురాలిగా కూడా జయ ఖ్యాతి గడించారు.

పారిశ్రామిక వేత్త, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, ప్రేమలత దంపతుల కుమార్తె జయ బాడిగ. రామకృష్ణ 2004 – 09 వరకూ కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభకు ఎన్నికయ్యారు.  అమెరికాలో జడ్జిగా నియమితులైన తొలి తెలుగు మహిళగా జయ రికార్డు సృష్టించారు. పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్