Tuesday, March 17, 2026
Homeసినిమా బాలయ్య, అనిల్ రావిపూడి మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

 బాలయ్య, అనిల్ రావిపూడి మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించారు. ఆతర్వాత ‘వీరసింహారెడ్డి’ మూవీతో కూడా బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ ఫామ్ లోకి వచ్చేశారు. ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడితో భారీ చిత్రం చేస్తున్నారు. ఇది బాలయ్య 108వ చిత్రం. ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుండడం విశేషం. ఆమధ్య షూటింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఆతర్వాత షూటింగ్ కి గ్యాప్ వచ్చింది. త్వరలోనే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. అయితే.. ఈ మూవీ అప్ డేట్స్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

అయితే.. ఈ సినిమాలో బాలయ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడిగా కనిపించబోతున్నారనే ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంత వరకూ తెర పై ఎక్కువుగా రాయలసీమ మాండలికంలో డైలాగ్స్ చెబుతూ వచ్చిన బాలయ్య తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చెప్పచ్చు. ఈ సినిమాలో బాలయ్య 40 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తిగా .. జైల్లో 14 ఏళ్ల శిక్షను అనుభవించి తిరిగి వచ్చిన 60 ఏళ్ల వ్యక్తిగా రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నారు.

అనిల్ రావిపూడి కామెడీ టచ్ కొంత మాత్రమే ఉంటుందట. బాలయ్య మార్క్ యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3.. ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నారు. దీంతో బాలయ్యతో చేసే సినిమాతో కూడా సక్సెస్ సాధించడం ఖాయం అనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి.. బాలయ్యతో అనిల్ రావిపూడి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో.. ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తారో అనేది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular