Sunday, November 24, 2024
Homeసినిమారెమ్యూనరేషన్ పెంచేసిన బాలయ్య

రెమ్యూనరేషన్ పెంచేసిన బాలయ్య

బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా బాలయ్య కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాత వచ్చిన బాలయ్య చిత్రం ‘వీరసింహారెడ్డి’. మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కూడా బ్లాక్ బస్టర్ సాధించింది. ఇంకా చెప్పాలంటే.. అఖండ ఫుల్ రన్ లో కలెక్ట్ చేసిన మొత్తాన్ని వీరసింహారెడ్డి ఫస్ట్ వీక్ లోనే కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అయితే.. ఒక్క సక్సెస్ వస్తే చాలు హీరోలు రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. నిర్మాతలు కూడా హీరోలు అడిగినంతగా ఇవ్వడానికి వెనకాడడం లేదు. బాలయ్య వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించడంతో రెమ్యూనరేషన్ పెంచేశారని తెలిసింది. ఇంతకీ ఎంతంటే.. తన రెమ్యునరేషన్ ను బాలయ్య 20 కోట్లు చేసినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారు. ఇందులో బాలయ్యకు కూతురుగా శ్రీలీల నటిస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. తాజా షెడ్యూల్ ఈ నెలాఖరు నుంచి స్టార్ట్ చేయనున్నారు.

వాస్తవానికి బాలయ్య రెమ్యునరేషన్ కు సంబంధించిన చర్చ ఎప్పుడూ రాదు. కొన్నేళ్లకు ఒకసారి ఆయన పారితోషికాన్ని పెంచుతారు. ప్రస్తుతం బాలయ్య సినిమాలు  70 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నాయి. దీనికి తోడు ఓటీటీ, టీవీ, డిజిటల్ హక్కుల విషయంలో కూడా డిమాండ్ భారీగా ఉంది. దీంతో, ఆయన రెమ్యునరేషన్ పెంచినట్టు తెలిసింది. ఈ విధంగా బాలయ్య రెమ్యూనరేషన్ పరంగా 20 కోట్ల క్లబ్ లో జాయన్ కావడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్