Saturday, January 18, 2025
Homeసినిమా'భగవంత్ కేసరి' మాసివ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్

‘భగవంత్ కేసరి’ మాసివ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్

బాలకృష్ణ అఖండ, వీరసింహా రెడ్డి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన తర్వాత చేస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.. కూతురుగా శ్రీలీల నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో బాలయ్య పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సినిమా పై మరింతగా అంచనాలు పెంచేసింది.

ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. ఈ సినిమాను అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ లో, భారీ గన్స్ తో కనిపిస్తున్న బాలయ్య యాక్షన్ లుక్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరో ముఖ్యమైన పాత్రలో ప్రియాంక జవాల్కర్ కనిపించనుండగా, ప్రతినాయకుడిగా అర్జున్ రాంపాల్ తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. ఈ దసరాకి ఈ సినిమా సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్