Saturday, January 18, 2025
HomeసినిమాNBK 109: బాలయ్య, బాబీ మూవీ లేటెస్ట్ న్యూస్

NBK 109: బాలయ్య, బాబీ మూవీ లేటెస్ట్ న్యూస్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.. కూతురుగా శ్రీలీల నటిస్తుంది. ఈ మూవీ ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూ మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. ఇక  దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

అయితే.. ఈ సినిమా తర్వాత బాలయ్య బాబీ డైరెక్షన్ లో మూవీ చేయనున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇటీవల ఈ మూవీని ప్రకటించారు. ఇప్పుడు ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ చిత్రీకరించేందుకు సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ వేస్తున్నారని తెలిసింది. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో విజువల్స్ వావ్ అనిపించేలా ఉంటాయట. ముఖ్యంగా బాలయ్య గెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట. ఇంకా చెప్పాంటే…  ఈ సినిమాకే హైలెట్ అనేలా ఈ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారట. అలాగే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ పాలిటిక్స్ నేపథ్యంలో ఉంటుదట. ఇక డైలాగ్స్ అయితే.. ఓ రేంజ్ లో ఉంటాయని కూడా అంటున్నారు. ఈ చిత్రానికి కథను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించడం విశేషం. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలి అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రచారంలో ఉన్నట్టుగా సంక్రాంతికి వస్తుందా..? వాయిదా పడనుందా..? అనేది త్వరలో తెలుస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్