Monday, March 16, 2026
Homeసినిమాబాల‌య్య‌ 107 ఎంతవ‌ర‌కు వ‌చ్చింది?

బాల‌య్య‌ 107 ఎంతవ‌ర‌కు వ‌చ్చింది?

Balayya roar: నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్  వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి గ్యాప్ లేకుండా షూటింగును చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది.

బాల‌య్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేశారు. దీనికి ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఈ మూవీ పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది. దీంతో అభిమానులు ఈ మూవీ అప్ డేట్స్ కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. అమెరికాలో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కొన్ని కారణాల వలన అది కుదరకపోవడంతో టర్కీలో ప్లాన్ చేశారని స‌మాచారం. త్వరలోనే ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరనున్నట్టు తెలుస్తోంది.

ట‌ర్నీలో కొన్ని కీల‌క సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ సరసన నాయికగా శృతి హాసన్ నటిస్తుండగా, ప్రతినాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ్ కనిపించనున్నాడు. అఖండ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ద‌స‌రాకి ఈ సినిమా వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

Also Read బాల‌య్య మూవీలో రాజ‌శేఖ‌ర్? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular