Friday, March 20, 2026
Homeసినిమాఆ.. రైట‌ర్ తో మూవీకి బాల‌య్య ఓకే చెప్పారా?

ఆ.. రైట‌ర్ తో మూవీకి బాల‌య్య ఓకే చెప్పారా?

Balayya Row: నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్ లో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఇందులో బాల‌య్య స‌ర‌స‌న శృతి హాస‌న్ న‌టిస్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించే ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య‌.. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో ఓ భారీ చిత్రం చేయ‌నున్నారు.

ఈ సినిమాను ఆగ‌ష్టులో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే… బాల‌య్య ఇప్పుడు ఓ రైట‌ర్ కి ఛాన్స్ ఇచ్చార‌ని టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రా రైట‌ర్ అంటారా… బి.వి.ఎస్.ర‌వి. రచయితగా బివిఎస్ రవికి మంచి పేరు ఉంది. ఆయన పని చేసిన చాలా సినిమాలు విజయాలను అందుకున్నాయి. కాకపోతే ఆయన దర్శకత్వం వహించిన వాంటెడ్, జవాన్ రెండు సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి.

అయితే… ఆయన వినిపించిన కథ బాలయ్యకు బాగా న‌చ్చింద‌ట‌. వెంట‌నే.. ఇంకేమి ఆలోచించ‌కుండా బివిఎస్ ర‌వితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. బాలయ్య చేసిన అన్ స్టాపబుల్ టాక్ షోను డిజైన్ చేసింది బివిఎస్ రవినే. ఆ పరిచయంతోనే బాలయ్య ఛాన్స్ ఇచ్చాడనే టాక్ కూడా వినిపిస్తోంది. మ‌రి.. బాల‌య్య‌ను బివిఎస్ ర‌వి ఎలా చూపించ‌ను న్నాడో..? ఈసారైనా బివిఎస్ ర‌వి ద‌ర్శ‌కుడిగా విజ‌యం సాధిస్తాడో లేదో చూడాలి.

Also Read : బాల‌య్య మూవీ టైటిల్ ఇదే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular