Sunday, January 19, 2025
Homeసినిమాబాల‌య్యతో మూవీపై అనిల్ రావిపూడి ఏమ‌న్నారో తెలుసా?

బాల‌య్యతో మూవీపై అనిల్ రావిపూడి ఏమ‌న్నారో తెలుసా?

Anil Ravipudi with Balayya:
ప‌టాస్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై.. తొలి చిత్రంతోనే స‌క్స‌స్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. ఆ త‌ర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, స‌రిలేరు నీకెవ్వ‌రు.. ఇలా వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్స్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ మూవీ చేస్తున్నారు. విక్ట‌రీ వెంకటేష్‌, మెగా హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. సంక్రాంతికి పోటీ ఎక్కువుగా ఉండ‌డం వ‌ల‌న ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అనిల్ రావిపూడి బాల‌య్య‌తో సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ చిత్రానికి రామారావు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేయ‌డం జ‌రిగింది. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఇప్ప‌టి వ‌ర‌కు సెట్ కాలేదు. అయితే.. ఇటీవ‌ల బాల‌య్య‌కు అనిల్ రావిపూడి క‌థ చెప్ప‌డం.. బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని తెలిసింది. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బాల‌య్య‌తో అనిల్ రావిపూడి కామెడీ సినిమా చేయ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇదే విష‌యం గురించి అనిల్ రావిపూడిని అడిగితే “అనిల్ రావిపూడి అంటే ఎంటర్ టైన్మెంట్ ను బాగా హ్యాండిల్ చేయగ‌లడు. అందుచేత బాల‌య్య‌తో చేసే సినిమా ఎంట‌ర్ టైన‌ర్ అనుకుంటున్నారు కానీ.. బాల‌య్య‌తో చేసే సినిమా ఎంటర్ టైన్మెంట్ మూవీ కాదు. బాలకృష్ణ గారితో ఫుల్ లెంగ్త్‌ కామెడీ సినిమాను చేయలేం. ఆయన శైలి వేరు. పటాస్‌లా పూర్తిగా ఆయన శైలిలోనే సినిమా చేస్తాను అని చెప్పారు జ‌న‌వ‌రి నుంచి ఈ మూవీ స్ర్కిప్ట్ పై వ‌ర్క్ చేస్తాను. జూన్, జూలై నాటికి సెట్స్ మీదకు వెళ్తాం” అని క్లారిటీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్