Saturday, January 18, 2025
Homeసినిమాబాలయ్య నెక్ట్స్ మూవీకి ముహుర్తం ఫిక్స్

బాలయ్య నెక్ట్స్ మూవీకి ముహుర్తం ఫిక్స్

బాలకృష్ణ ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ అనే సినిమా చేస్తున్నారు. మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో రూపొందుతోన్న చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం.. బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ తర్వాత బాలయ్య చేసిన సినిమా కావడంతో వీరసింహారెడ్డి పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడితో ఓ భారీ చిత్రం చేయనున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమాని ప్రారంభించడానికి డేట్ ఫిక్స్ చేశారని తెలిసింది. డిసెంబర్ 8న హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఓ జైల్ సెట్ వేస్తున్నారని, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ జైల్ ఎపిసోడ్ తో షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. కాగా అనిల్ రావిపూడి తన రూట్ మార్చుకుని బాలయ్యను కొత్త తరహాలో చూపించనున్నాడట. ఈ చిత్రంలో బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించనుంది. అనిల్ రావిపూడి క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ చేశారని తెలిసింది.

ముఖ్యంగా బాలయ్యకి విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అందుకే.. బాలయ్య, అనిల్ రావిపూడి కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ క్రేజీ మూవీకి ‘రామారావు’ గారు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. బాలయ్య సరసన నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను ఫైనల్ చేసినట్టు సమాచారం.

Also Read : ‘ఆదిత్య 999’ డైరెక్ట్ చేస్తా – బాలయ్య 

RELATED ARTICLES

Most Popular

న్యూస్