Saturday, January 18, 2025
Homeసినిమాసిరిసిల్ల‌లో బాలయ్య హంగామా షురూ

సిరిసిల్ల‌లో బాలయ్య హంగామా షురూ

Shooting started: అఖండ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన న‌ట‌సింహ‌ నంద‌మూరి బాల‌కృష్ణ విజ‌యోత్సాహంతో త‌దుప‌రి చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ను ఈరోజు మొద‌లుపెట్టారు. మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు కేరాఫ్‌గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. న‌వంబ‌ర్‌లో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఇప్పుడు రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న‌ 107వ సినిమా ఇది.

స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌తో లీడింగ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్ర‌వారం ఉద‌యం రెగ్యుల‌ర్‌ షూటింగ్ సిరిసిల్ల‌లో మొద‌లైంది. శ్రుతిహాస‌న్ ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా రెడీ చేసిన క‌థ‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. రెండు మేజ‌ర్ షెడ్యూళ్ల‌లో టాకీ పూర్తి చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్