Sunday, January 19, 2025
Homeసినిమాబాల‌య్య.. బిజీ బిజీ

బాల‌య్య.. బిజీ బిజీ

Balayya teaser: నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. దీంతో మ‌రెంత స్పీడుగా వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్ లో బాల‌కృష్ణ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నారు. ఇందులో బాల‌య్య స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న‌ ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింద‌ని స‌మాచారం.

ఇంత‌కీ ఎప్పుడంటే.. జూన్ 10న బాల‌కృష్ణ పుట్టిన‌రోజు. అభిమానుల‌కు పండ‌గ రోజు. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ టీజ‌ర్ ను జూన్ 10న‌ రిలీజ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఇక ఈ సినిమా త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో బాల‌య్య సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమా క‌థ ఎప్పుడో రెడీ అయ్యింది. ఈ మూవీని జూన్ లేదా జులైలో స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. తాజా స‌మాచారం ప్ర‌కారం ఆగ‌ష్టులో ఈ సినిమాని స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Also Read : మా ఇద్ద‌రినీ ఆ దేవుడే క‌లిపాడు : బాల‌కృష్ణ‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్