Title on Ugadi: నట సింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఇటీవలే బాలయ్య, శృతి హాసన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే బాలయ్య, ఫైటర్స్ పై యాక్షన్ ఎపిసోడ్ ను కూడా షూట్ చేశారు.
ఇక ఈ మూవీ తాజా అప్ డేట్ ఏంటంటే… ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను ఉగాది సందర్భంగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ త్వరలో వస్తుందని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలి అనే ప్లాన్ తో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇక రిలీజ్ ఎప్పుడంటే.. దసరాకి రిలీజ్ చేయాలనేది ప్లాన్. మరి.. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన బాలయ్య ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.
Also Read : బాలయ్య మూవీలో రవితేజ?