Saturday, January 18, 2025
Homeసినిమాబాల‌య్య మూవీ టైటిల్ ఎప్పుడు?

బాల‌య్య మూవీ టైటిల్ ఎప్పుడు?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్ లో భారీ యాక్ష‌న్ మూవీ చేస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఇటీవ‌ల ట‌ర్కీలో కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌రించారు. దీంతో షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.మైత్రీ మూవీ  ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఈ సినిమాకి కొన్ని పవర్ ఫుల్ టైటిల్స్ వినిపించాయిగానీ, ఇంత వరకూ ఏ టైటిల్ ను ఖరారు చేయలేదు. దసరా పండుగ రోజున టైటిల్ పోస్టర్ రిలీజ్ ఉండొచ్చని ప్ర‌చారం జ‌రిగింది కానీ..ఎలాంటి అప్ డేట్ ఇవ్వ‌లేదు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ టీజర్ ఈవెంట్ పై ఫోకస్ చేయడం వలన కుదరలేదు. టైటిల్ ప్రకటన దీపావళికి ఉండొచ్చని టాక్  తాజాగా వినిపిస్తోంది. టైటిల్ లుక్ తోనే  సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా గోపీచంద్ మలినేని కసరత్తు చేస్తున్నాడని స‌మాచారం. డిసెంబ‌ర్ లేదా జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్