Saturday, January 18, 2025
Homeసినిమాసీమ బ్యాక్ డ్రాప్ తోనే బాల‌య్య‌-మలినేని మూవీ

సీమ బ్యాక్ డ్రాప్ తోనే బాల‌య్య‌-మలినేని మూవీ

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ అంటే ఫ్యాక్ష‌న్ సినిమాలు గుర్తొస్తాయి. రాయ‌ల‌సీమ క‌థ‌ల‌తో బాక్సాఫీస్ ని షేక్ చేశారు.  ఆయన నటించిన అనేక చిత్రాలు రాయలసీమ నేపథ్యంగా సాగినవే. సమరసింహరెడ్డి, నరసింహ నాయుడు నుంచి ఇటీవల వచ్చిన అఖండ వరకు ఆ కోణంలో వచ్చినవే. ఆయ‌న రాయ‌ల‌సీమ్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేస్తున్నారంటే.. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌రే అనే టాక్ ఉంది.

ఇదిలా ఉంటే.. బాల‌య్య ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్ లో ఓ భారీ యాక్ష‌న్ మూవీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. బాల‌య్య స‌ర‌స‌న ఇందులో శృతిహాస‌న్ న‌టిస్తుంది. అయితే.. ఆయన నటిస్తున్న ఈ చిత్రం కోసం కొంత భాగాన్ని కర్నూలులో చిత్రీకరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో బాలయ్య షూటింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో బాలయ్య నరసింహ నాయుడు తరహా లుక్ లో కనిపిస్తున్నారు.

ఈ ఫోటోలకి  అభిమానులు తెగ లైక్ కొడుతున్నారు. కీల‌క స‌న్నివేశాల‌ను అక్క‌డ చిత్రీక‌రిస్తున్నారు. రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న సినిమా కావ‌డం.. ఆమ‌ధ్య రిలీజ్ చేసిన టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. డిసెంబ‌ర్ 2న ఈ మూవీ రిలీజ్ కానుందని స‌మాచారం. మ‌రి.. ఈ మూవీ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా బ్లాక్ బ‌స్ట‌ర్ సాధిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్