Saturday, January 18, 2025
Homeసినిమామ‌ల్టీస్టారర్ వార్తలు నిజం కాదా?

మ‌ల్టీస్టారర్ వార్తలు నిజం కాదా?

Single Star: విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్లో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ఎఫ్ 3. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎఫ్ 2 సీక్వెల్ గా రూపొందుతోన్న ఎఫ్ 3 మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఎఫ్ 3 త‌ర్వాత అనిల్ రావిపూడి న‌ట‌సింహ బాల‌కృష్ణ‌తో సినిమా చేయ‌నున్నారని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.

అయితే… ఈ మూవీ మ‌ల్టీస్టార‌ర్ అని.. ఇందులో బాల‌య్య‌తో పాటుగా నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ కూడా న‌టించ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ కాదు.. బాల‌య్య‌తో మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించ‌నున్నార‌ని టాక్ వినిపించింది. అన్ స్టాప‌బుల్ టాక్ షోలో ర‌వితేజ‌ పాల్గొన్న‌ప్పుడు.. బాల‌య్య‌తో సినిమా చేయాల‌నుకుంటున్నాన‌ని చెప్ప‌డం.. మ‌నిద్ద‌రం క‌లిసి సినిమా చేద్దామ‌ని బాల‌య్య ర‌వితేజ‌తో అన‌డం.. ఇప్పుడు వార్త‌లు రావ‌డంతో ఈ కాంబినేష‌న్ సెట్ అయ్యింది అనుకున్నారు.

ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. ఇంత‌కీ అనిల్ రావిపూడి ఏం చెప్పారంటే.. బాల‌య్య‌తో చేయ‌నున్న సినిమా మ‌ల్టీస్టార‌ర్ కాదు. అందులో బాల‌య్య ఒక్క‌రే హీరో. ఈ సినిమాకి సంబంధించి క‌థ ఎప్పుడో లాక్ అయ్యింది.. ప్ర‌స్తుతం ఎఫ్ 3 వ‌ర్క్ లో బిజీగా ఉన్నాను. ఎఫ్ 3 రిలీజ్ త‌ర్వాత బాల‌య్య‌తో చేయ‌నున్న సినిమాకి సంబంధించి మ‌రెన్ని వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తాను అన్నారు. ఈ మూవీ జూన్ లేదా జులైలో సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం

Also Read : బాల‌య్యతో మూవీపై అనిల్ రావిపూడి ఏమ‌న్నారో తెలుసా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్