Tuesday, March 10, 2026
Homeసినిమాబాలయ్య కొత్త సినిమా ప్రకటన

బాలయ్య కొత్త సినిమా ప్రకటన

నందమూరి నటసింహం బాలకృష్ణ – క్రాక్ మూవీ డైరెక్టర్ మలినేని గోపీచంద్ కాంబినేషన్ లో మూవీ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు బాలయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇది బాలయ్య 107వ చిత్రం. ఈ మూవీ కొన్ని యదార్థ సంఘటనలు ఆధారంగా రూపొందుతుందని.. బాలయ్య వేట త్వరలో మొదలు కానుందని ప్రకటించింది.

ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన నటించే హీరోయిన్ అంటూ శృతిహాసన్, త్రిష పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. కథానాయిక ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం. దాదాపుగా స్ర్కిప్ట్ వర్క్ పూర్తయ్యింది. సెట్స్ పైకి వెళ్లనుంది ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారు. ఆతర్వాత అఖండ రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటిస్తామని నిర్మాత తెలియచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular