Sunday, January 19, 2025
Homeసినిమాబాలయ్యని సీఎం చేస్తున్న పరశురామ్!

బాలయ్యని సీఎం చేస్తున్న పరశురామ్!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు. మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న  ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇటీవల బాలయ్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా స్టార్ట్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందే ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా శ్రీలీల నటిస్తుంది. ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్ ఉండే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని అనిల్ రావిపూడి తెలియచేశారు.

ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేయనున్నారు అంటే.. పరశురామ్ పేరు వినిపిస్తోంది. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించడంతో నాగచైతన్యతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. అదే టైమ్ లో సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో సినిమా చేసే ఆఫర్ రావడంతో మహేష్‌ తో మూవీ చేసుకుని వస్తానని నాగచైతన్యకు చెప్పి సర్కారు వారి పాట చేశాడు. సర్కారు వారి పాట కంప్లీట్ చేసి వచ్చేసరికి నాగచైతన్య కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో మూవీ స్టార్ట్ చేశాడు. దీంతో పరశురామ్ నాగచైతన్య కోసం వెయిట్ చేయకతప్పడం లేదు.

ఈ గ్యాప్ లో బాలయ్య కోసం పరశురామ్ ఓ కథ రెడీ చేశారట. ఇందులో బాలయ్య సీఎంగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. బాలయ్య సీఎం అయితే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పుడు అదే తెర పై చూపిస్తే.. బాగుంటుందనే ఉద్దేశ్యంతో పరశురామ్ అలా స్టోరీని రెడీ చేశారని తెలిసింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. 2024 సంక్రాంతికి ఈ సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రేజీ కాంబో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్