Thursday, March 19, 2026
Homeసినిమాదసరా రేసులో బాలయ్య, రవితేజ, రామ్

దసరా రేసులో బాలయ్య, రవితేజ, రామ్

ఎనర్జిటిక్ హీరో రామ్, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఇప్పటివరకు చేయని మాస్ క్యారెక్టర్ ను రామ్ చేస్తున్నారు. అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు అమాంతం పెరిగాయి. సమ్మర్ కి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన వాయిదాపడింది. దసరాకి విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సైలెంట్ గా షూటింగ్ జరుగుతోంది కానీ కథ ఏంటనేది బయటకు రాకపోవడంతో  మరింత ఆసక్తి ఏర్పడింది.

ఇక మాస్ మహారాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’చేస్తున్నారు. ఈ సినిమా కొన్ని యధార్థ సంఘటనలు ఆధారంగా రూపొందుతోంది. ఇందులో రేణు దేశాయ్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని కూడా దసరాకి విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో దసరాకి రామ్, రవితేజ పోటీపడనున్నారనేది ఆసక్తిగా మారింది. రామ్ మూవీ, రవితేజ మూవీ కూడా అక్టోబర్ 20నే వస్తున్నట్టుగా ప్రకటించడం విశేషం.

ఇప్పుడు వీరిద్దరే కాకుండా.. దసరాకి నేనూ వస్తున్నాను అంటూ నటసింహం బాలయ్య ప్రకటించారు. ప్రస్తుతం బాలయ్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఇది బాలయ్య 108వ చిత్రం.

ఈ చిత్రాన్ని కూడా దసరాకి విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించడంతో బాక్సాఫీస్ దగ్గర రసవత్తరమైన పోటీ ఏర్పడింది. బాలయ్య వస్తున్నానని ప్రకటించి రామ్, రవితేజలను టెన్షన్ పెట్టారు.  దసరాకి వస్తున్నామని  చెప్పారు కానీ డేట్ ఫిక్స్ చేయలేదు. NBK 108 అక్టోబర్ 19 లేదా 21 తేదీల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం అని సమాచారం. సో.. ముగ్గురు పోటీపడతారా..? లేక బాలయ్య, రవితేజ, రామ్ లలో ఎవరో ఒకరు పోటీ నుంచి తప్పుకుంటారా..? అనేది చూడాలి.

Also Read : రావణాసుర రన్ టైమ్ ఎంత..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular