Back soon: ‘ఆహా’లో సక్సెస్ అయిన అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కే. ఇలా ఓటీటీలో బాలయ్య ఎంట్రీ ఇస్తారని.. టాక్ షోకు హోస్ట్ గా చేసి సక్సెస్ సాధిస్తారని ఎవరూ ఊహించలేదు. ఈ టాక్ షోలో స్టార్స్ ను తనదైన స్టైల్ లో బాలయ్య ఇంటర్ వ్యూ చేసి ఎంటర్ టైన్ చేయడంతో ఈ షో సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ కానుందా..? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అయితే.. బాలయ్య సినిమాల్లో బిజీగా ఉండడంతో సీజన్ 2కు బాలయ్య కాకుండా వేరే ఎవరైనా హోస్ట్ గా చేస్తారేమో అనే టాక్ కు కూడా బయటకు వచ్చింది. అయితే.. తెలుగు ఇండియన్ ఐడిల్ అన్ స్టాపబుల్ టాప్ 6 ప్రొగ్రామ్ లో ప్రచారంలో ఉన్న వార్తల పై క్లారిటీ వచ్చింది. ఈ కార్యక్రమం చివరిలో శ్రీరామచంద్ర అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడు అని అడిగారు. దీనికి బాలయ్య మధుర క్షణాలకు ముగింపు ఉండదు.. కొనసాగింపే.. అని సమాధానం ఇచ్చారు.
సో.. అన్ స్టాపబుల్ టాక్ షో బాలయ్యతోనే. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ రాలేదు. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. దసరాకి అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్ 2 స్టార్ట్ కానుందని తెలిసింది. మరో వైపు బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం కూడా దసరాకి వచ్చేందుకు రెడీ అవుతుంది. మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ భారీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సో.. దసరాకి ఓ వైపు సినిమా, మరో వైపు టాక్ షో వస్తే.. బాలయ్య అభిమానులకు పండగే.
Also Read : బాలకృష్ణతో ‘ఆహా’ సరికొత్త టాక్ షో ‘అన్ స్టాపబుల్’