Sunday, January 19, 2025
Homeసినిమా బాల‌య్య అన్ స్టాప‌బుల్ 2 లో చిరు, నాగ్, వెంకీ.?

 బాల‌య్య అన్ స్టాప‌బుల్ 2 లో చిరు, నాగ్, వెంకీ.?

నంద‌మూరి బాల‌కృష్ణ ఓవైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు అన్ స్టాప‌బుల్ టాక్ షో చేస్తున్నారు. ఈ టాక్ షో ఫ‌స్ట్ సీజ‌న్ సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. దీంతో సెకండ్ సీజ‌న్ ఎలా ఉండ‌బోతుంది?  ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఇటీవ‌ల అన్ స్టాప‌బుల్ 2 గురించి ఆహా టీమ్ టీజ‌ర్ రిలీజ్ చేసింది.

విజ‌య‌వాడ‌లో అన్ స్టాప‌బుల్ 2 వేడుకను అభిమానుల స‌మ‌క్షంలో గ్రాండ్ గా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స్పందించిన బాల‌య్య ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. “చాలా మంది అన్ స్టాప‌బుల్ సీజ‌న్ 2 లో ఎవ‌రు గెస్టులుగా వ‌స్తున్నారు..?  చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్ గెస్టులుగా వ‌స్తారా..? అని అడుగుతున్నారు. త‌ప్ప‌కుండా వాళ్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. టైమ్ ని బ‌ట్టి త‌ప్ప‌కుండా ఉంటుంది. వాళ్లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేలా ఆహా టీమ్ ప్ర‌య‌త్నం చేయాలి” అని చెప్పారు.

“సినిమా షూటింగ్ కి ఎలా ఫీల‌య్యావాడినో అన్ స్టాప‌బుల్ షూటింగ్ కూడా అలాగే ఫీల‌య్యాను. ఈ టాక్ షో స‌క్సెస్ అవ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సీజ‌న్ లో మ‌రింత‌గా ఎంట‌ర్ టైన్మెంట్ ఉంటుంది. త‌ప్ప‌కుండా అంద‌ర్నీ విశేషంగా ఆక‌ట్టుకుంటుంద”ని బాల‌య్య చెప్పారు.

Also Read : వియ్యంకుల మధ్య ‘అన్ స్టాప‌బుల్’ ముచ్చట్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్