Saturday, January 18, 2025
Homeసినిమాబోయపాటి వైపే మొగ్గుచూపుతున్న బాలయ్య!

బోయపాటి వైపే మొగ్గుచూపుతున్న బాలయ్య!

బాలకృష్ణ 109వ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. భారీ బడ్జెట్ నిర్మితమవుతున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ కొంతవరకూ జరిగింది. ఈ సినిమాలో బాలకృష్ణ వయసుతో ముడిపడిన మూడు దశలలో .. మూడు పాత్రలలో కనిపించనున్నారు. ఒక్కో దశలో ఒక్కో హీరోయిన్ ఆయన సరసన మెరనుంది. అందువలన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది.  ఈ నేపథ్యంలో బాలయ్య 110వ సినిమా ఏ దర్శకుడితో ఉండనుందనేది కూడా అభిమానులలో ఆసక్తిని పెంచుతోంది.

బాలయ్య కోసం బోయపాటి ‘అఖండ 2’ కథను సిద్ధం చేశాడనీ, అందువలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందనే టాక్ వచ్చింది. ఇక ఇదే సమయంలో హరీశ్ శంకర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. హరీశ్ శంకర్ ఒక కథను బాలయ్యకి వినిపించాడనీ, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే వార్త కొన్ని రోజుల క్రితమే వినిపించింది. ఆ సినిమా చేయడానికి బాలయ్య ఉత్సాహాన్ని చూపుతున్నారనే టాక్ వచ్చింది. దాంతో ఈ రెండు సినిమాలలో ముందుగా ఏది సెట్స్ పైకి వెళుతుందనేది అభిమానుల మధ్య చర్చనీయాంశమైంది.

అయితే ముందుగా బోయపాటితోనే సెట్స్ పైకి వెళ్లాలనే నిర్ణయానికి బాలయ్య వచ్చినట్టుగా చెబుతున్నారు. ‘అఖండ 2’ సినిమాకి సంబంధించిన అన్ని పనులను బోయపాటి సిద్ధం చేసుకుని ఉండటం, ఈ ప్రాజెక్టుపై అందరిలో కుతూహలం ఉండటం వలన, ముందుగా ఈ ప్రాజెక్టును చేయాలనే ఉద్దేశంతో బాలయ్య ఉన్నారని అంటున్నారు. 14 రీల్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాతనే ఆయన హరీశ్ శంకర్ సినిమా చేస్తారన్న మాట.

RELATED ARTICLES

Most Popular

న్యూస్