Sunday, January 19, 2025
Homeసినిమా'బనారస్' నవంబర్ 4న విడుదల

‘బనారస్’ నవంబర్ 4న విడుదల

కర్ణాటక శాసనసభకు నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికైన జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

నవంబర్ 4వ తేదీన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. జైద్ ఖాన్, అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పొందాడు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ప్రమోషన్స్ లో మరింత దూకుడు పెంచబోతుంది చిత్ర యూనిట్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్