గొల్లకొండ కోట మీద కాషాయ జండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. గోల్కొండ అసలు పేరు గొల్లకొండ అన్నారు. పాత బస్తికి రావాలి అంటే అనుమతి కావాలా అని ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గోల్కొండ వద్ద జరిగిన సభలో బండి సంజయ్ తెరాస, ఎం.ఐ.ఎం తీరుపై మండిపడ్డారు. నిన్న బాగ్యలక్ష్మీ దేవాలయం దగ్గర సభ పెట్టాము… మళ్ళీ పెడతామని, ఆలె నరేంద్ర మన మీద పెట్టి పోయిన బాధ్యతలు మనము పూర్తి చేద్దామన్నారు.
మన కార్యక్రమాలు నిర్వహించేందుకు టూత్ పాలిష్ గాళ్ల, లఫంగ లుచ్చాల అనుమతి అవసరం లేదని, నిన్న నరేంద్ర దగ్గరికి నేడు బద్దం బాల్ రెడ్డి దగ్గరకు వచ్చానన్నారు. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదని, కానీ హిందువులకు అన్యాయం జరిగితే ఊరుకొమని సంజయ్ తేల్చి చెప్పారు. త్రిబుల్ తలాక్ మూర్ఖత్వపు విధానాన్ని పీఎం మోడీ తొలగించారని, మోడీ పథకాలు కేవలం హిందువులకే ఇవ్వడం లేదు..ముస్లిం లకు కూడా పథకాలు అందుతున్నాయన్నారు.
తెలంగాణను వ్యతిరేకించిన mim తో కేసీఆర్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు. Mim గుండాల చేతిలో అశువులు బాసిన పాపన్న, నందరాజ్ గౌడ్ ల త్యాగం వృధా పోనియ్యమన్నారు. హుజూరా బాద్ లో గెలిచేది ఈటల రాజేందరే అని బండి సంజయ్ అన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ {పాదయాత్ర }ప్రజా సంగ్రామ యాత్ర రేపు బాపు ఘాట్ నుండి ప్రారంభంకానుంది.