Sunday, January 19, 2025
HomeTrending NewsBJP: నాగర్ కర్నూల్ లో బీజేపీ ‘‘నవ సంకల్ప సభ‘‘

BJP: నాగర్ కర్నూల్ లో బీజేపీ ‘‘నవ సంకల్ప సభ‘‘

మహా జనసంపర్క్ అభియాన్ లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రేపు సాయంత్రం 4 గంటలకు బీజేపీ నిర్వహించబోయే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డా ఈ బహిరంగ సభకు హాజరై దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ 9 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఈ బహిరంగ సభకు ‘‘నవ సంకల్ప సభ‘‘ అని నామకరణం చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు.

అక్కడి నుండి నేరుగా నోవాటెల్ చేరుకుని భోజనం చేస్తారు. అటు నుండి ‘‘సంపర్క్ సే సమర్థన్‘‘ లో భాగంగా టోలిచౌక్ లోని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, జూబ్లిహిల్స్ ఫిల్మ్ నగర్ లోని పద్మశ్రీ శ్రీమతి ఆనంద శంకర్ జయంతిల నివాసాలకు వెళతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలన విజయాలను వివరించడంతోపాటు మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై పుస్తకాలను అందజేస్తారు. అక్కడి నుండి సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ వెళ్లి ప్రత్యేక హెలికాప్టర్ లో నాగర్ కర్నూలు చేరుకుంటారు. నేరుగా జడ్పీ హైస్కూలు మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. దాదాపు గంటన్నరపాటు సభలోనే ఉంటారు. ఈ సందర్భంగా మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతి, అభివ్రుద్ది, సంక్షేమ పథకాలతోపాటు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడతారు.

ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ సభ ఏర్పాట్లపై నాగర్ కర్నూలు జిల్లాలోని పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒకవైపు బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు కలిసి బీజేపీని దెబ్బతీసేందుకు ఏ విధంగా కుట్రలు చేస్తున్నాయో మనందరికీ తెలుసు. బీఆర్ఎస్-కాంగ్రెస్ ఎప్పటి నుండో కలిసే పోటీ చేస్తున్నయ్. పార్లమెంట్ లోపల బయటా కలిసే బీజేపీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోని 30 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంపిణీ చేశారు.

ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీనే ఆదరిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ కు డిపాజిట్లు గల్లంతు చేస్తున్నారు. పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు కేసీఆర్, కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తప్పుడు ప్రచారాలతో అయోమయం స్రుష్టిస్తూ కలిసి కుట్ర చేస్తూనే ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్