Sunday, January 19, 2025
HomeసినిమాBandla Ganesh: గురుజీ పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

Bandla Ganesh: గురుజీ పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

బండ్ల గణేష్ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆతర్వాత నిర్మాతగా మారి భారీ చిత్రాలు నిర్మించాడు. బిజినెస్ లోనూ రాణిస్తున్నాడు. ఆయనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. ఇంకా చెప్పాలంటే.. పవన్ అంటే పిచ్చి. మైక్ దొరికిందంటే.. పవన్ కు ఆకాశానికి ఎత్తేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ తో తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలు నిర్మించాడు. వీటిలో తీన్ మార్ యావరేజ్ కాగా, గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆతర్వాత మళ్లీ పవన్ తో సినిమా చేయాలి అనుకున్నాడు కానీ.. కుదరలేదు.

ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఇండస్ట్రీలో గురుజీ అని పిలుస్తుంటారు. ఇప్పుడు బండ్ల గణేష్ గురుజీ అంటూ చేసిన ట్వీట్స్ సంచలనం అయ్యాయి. బండ్ల గణేష్ ను ట్యాగ్ చేసి ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. బండ్లన్నా నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది అని అడిగాడు. దీనికి బండ్ల గణేష్ గురుజీని కలవండి.. ఖరీదైన బహుమతి ఇవ్వండి.. అంతే అయిపోతుంది అని ట్వీట్ చేశాడు. అయితే.. ప్రొడ్యూసర్ కావాలని ఉందని ట్వీట్ చేసిన నెటిజన్ తర్వాత తీసేశాడు. ఆతర్వాత ‘గురూజీకి కథ చెబితే స్క్రీన్ ప్లే రాసి.. దానికి తగట్టు మళ్లీ కథను మార్చి.. అనుకున్న కథను షెడ్ కి పంపిస్తాడని టాక్ ఉంది’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘‘అదే కాదు..  భార్యాభర్తల్ని, తండ్రీ కొడుకుల్ని, గురుశిష్యుల్ని.. ఎవర్నైనా వేరు చేస్తాడు అనుకుంటే. అదే మన గురూజీ స్పెషాలిటీ’ అని సెటైర్లు వేశారు.

అయితే.. ఈ ట్వీట్ల వ్యవహారంలో గురూజీ ఎవరనేది మాత్రం బండ్ల గణేశ్ వెల్లడించలేదు. నిజానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో గురుజీ అని త్రివిక్రమ్ అని అంటారని అందరికీ తెలిసిందే. ఆయన్ని ఉద్దేశించే బండ్ల గణేష్ ట్వీట్ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పనిలో పనిగా అప్పట్లో మీరు కూడా ఇలానే ఖరీదైన బహుమతులు ఇచ్చారా అన్న అంటూ బండ్ల గణేశ్ కు కౌంటర్లు ఇవ్వడం కొసమెరుపు. మొత్తానికి బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ ఇండస్ట్రీలో సంచలనం అయ్యాయి. మరి.. ఈ ట్వీట్స్ వ్యవహరం ఎంత వరకు వెళుతుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్