Sunday, January 19, 2025
Homeసినిమాబంగార్రాజు ఫ‌స్ట్ లుక్ అండ్ టీజ‌ర్ కి ముహుర్తం ఫిక్స్

బంగార్రాజు ఫ‌స్ట్ లుక్ అండ్ టీజ‌ర్ కి ముహుర్తం ఫిక్స్

Bangarraju First Look Teaser  :
టాలీవుడ్ కింగ్ నాగార్జున‌, యువసామ్రాట్ నాగ‌చైత‌న్య‌ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ఇందులో నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ, నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి న‌టిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’ చిత్రానికి ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ రూపొందుతుండ‌డంతో ఈ క్రేజీ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నేది నాగార్జున ప్లాన్. అందుక‌నే ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచారు.

‘ల‌డ్డుండా’ అంటూ సాగే పాట‌ను ఇటీవలే విడుదల చేశారు. ఈ పాట‌కు అనూహ్యమైన స్పంద‌న ల‌భించింది. ఇటీవ‌ల కృతిశెట్టి లుక్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు బంగార్రాజు ఫ‌స్ట్ లుక్ అండ్ టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఫ‌స్ట్ లుక్ న‌వంబ‌ర్ 22న సాయంత్రం 5 గంట‌ల 22 నిమిషాల‌కు, టీజ‌ర్ న‌వంబ‌ర్ 23న ఉద‌యం 10.23 నిమిషాల‌కు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ కూడా విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

దీనికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ లో పాట‌లు ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేశాయో తెలిసిందే. ‘బంగార్రాజు’ పాట‌లు.. అంత‌కు మించి అనేట్టుగా ఉంటాయ‌ని టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో చెబుతున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగార్జున‌, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టిస్తున్న రెండో సినిమా కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన ‘మ‌నం’ ఓ సంచ‌ల‌నం. అలాగే బంగార్రాజు కూడా ఓ సంచ‌ల‌న చిత్రం అవుతుంద‌ని ఆశిద్దాం

Also Read : ‘బంగార్రాజు’లో నాగ‌ల‌క్ష్మి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్