Wednesday, March 18, 2026
Homeసినిమామూడు రోజుల‌కు 53 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసిన ‘బంగార్రాజు’

మూడు రోజుల‌కు 53 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసిన ‘బంగార్రాజు’

Record Collections: టాలీవుడ్ కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య క‌ల‌సి న‌టించిన తాజా చిత్రం ‘బంగార్రాజు’.  బ్లాక్ బస్టర్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్ అయిన బంగార్రాజు చిత్రాన్ని డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించారు. ఈ సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా రూపొందించారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన్ పై నాగార్జున ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు.

‘బంగార్రాజు’ మొద‌టి రెండ్రోజులు భారీ వసూళ్లు రాబట్టింది. నిజానికి ఈ చిత్రం రెండో రోజు మొదటిరోజుకంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ మూడో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులకు రూ. 53 కోట్ల గ్రాస్ వసూలు చేసింది, ఇది నాగార్జున, నాగ చైతన్య ఇద్దరికీ మొదటి వారాంతంలో అత్యధిక కలెక్షన్లు. ఈ భారీ క‌లెక్ష‌న్స్ తో ‘బంగార్రాజు’ సంక్రాంతి విజేతగా నిలిచాడు.

ఊహించినట్టుగానే.. బంగార్రాజు కోసం రెండవ రోజు నుండి అదనపు థియేటర్లును పెంచారు. ఈ నెలలో భారీ, క్రేజీ చిత్రాలు విడుదల లేక‌పోవ‌డం బంగార్రాజుకు మ‌రింత‌గా క‌లిసోస్తుంది. దీంతో లాంగ్ ర‌న్ లో బంగార్రాజు ఇంకెంత క‌లెక్ట్ చేస్తాడనేది ఆస‌క్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular