Friday, March 20, 2026
Homeసినిమాప్రేక్షకులను అలరిస్తున్న బంగార్రాజు టీజ‌ర్

ప్రేక్షకులను అలరిస్తున్న బంగార్రాజు టీజ‌ర్

Bangarraju Teaser out: టాలీవుడ్ కింగ్ నాగార్జున‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘బంగార్రాజు’. ఈ చిత్రానికి  టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంటే.. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి న‌టిస్తోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై నాగార్జున ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయ‌నా ప్రీక్వెల్ కావ‌డంతో బంగార్రాజు సినిమా పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

న్యూయ‌ర్ సంద‌ర్భంగా బంగార్రాజు టీజ‌ర్ ను రిలీజ్ చేశారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో బంగార్రాజుగా నాగార్జున సందడిచేయగా, ఇప్పుడు ఆయనకుతోడు చిన బంగార్రాజు నాగచైతన్యతో కలిసి అలరించనున్నారు.  లయకారుడి సన్నిధిలో అపశృతి జరిగిందని యమధర్మరాజు చెబుతుండగా.. బంగార్రాజు మళ్ళీ భూలోకానికి తిరిగి వచ్చినట్లు చూపించారు. అయితే.. ఈసారి తన మనమడు చిన బంగార్రాజు ఎదుర్కొన్న సమస్య పరిష్కారానికి బంగార్రాజు భూమ్మీదకు వచ్చినట్లు తెలుస్తోంది.

“ఇలా అందంగా ఉంటే దిష్టి తగిలి కాళ్ళు బెణుకుతాయి.. నేను దిష్టి తీయనా?’ అంటూ చైతూ అమ్మాయిలను ఫ్లర్ట్ చేయడం చూస్తుంటే.. బంగార్రాజు బుద్ధులతో ఊడిపడినట్లు తెలుస్తుంది. నాగ్, చైతూ కలసి రొమాన్స్ మాత్ర‌మే కాదు.. యాక్షన్ సీన్స్ లోను అదరగొట్టారు. టీజర్ చివర్లో అక్కినేని హీరోలిద్దరూ కలసి నడుచుకుంటూ వస్తుంటే.. చూడ‌డానికి ముచ్చ‌ట‌గా ఉంది. ఇది విశేషంగా ఆకట్టుకుంటోంది. మ‌రి.. సంక్రాంతికి వ‌స్తున్న బంగార్రాజు ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular