Sunday, November 24, 2024
HomeTrending Newsఆన్ లైన్ లో బాస‌ర‌ అమ్మవారి ఆలయ సేవలు

ఆన్ లైన్ లో బాస‌ర‌ అమ్మవారి ఆలయ సేవలు

బాస‌ర, మార్చి 14: ఆన్ లైన్ లో బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ, ఇ- హుండీ సేవలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. భ‌క్తుల‌కు మెరుగైన సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డంతోపాటు వారి సౌక‌ర్యార్ధం ప్రధాన ఆల‌యాల్లో ఆన్‌లైన్‌లో పూజలు, వ‌స‌తి బుకింగ్, ప్రసాదం పంపిణీ, త‌దిత‌ర‌ సేవ‌లను భ‌క్తులకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఆన్ లైన్ సేవ‌ల‌ వల్ల అమ్మవారి సేవ‌ల‌ను పార‌ద‌ర్శకంగా, సుల‌భంగా పొంద‌గ‌లుగుతారని చెప్పారు. భక్తులకు సేవలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి బాస‌ర‌లో ఆన్ లైన్ సేవ‌లు భ‌క్తులకు అందుబాటులోకి వ‌చ్చే విధంగా అధికారుల చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని తెలిపారు. అదే విధంగా ఇ- హుండీ సేవ‌ల‌ను కూడా భ‌క్తుల‌కు అందుబాటులోకి తెచ్చామ‌ని, డిజిట‌ల్ క‌రెన్సీ వినియోగం పెరిగినందు వ‌ల్ల భ‌క్తుల సౌక‌ర్యార్ధం ఈ స‌దుపాయాన్ని కూడా క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. పేటీయం, ఫోన్ పే, జీ పే లాంటి యూపీఐల ద్వారా హుండీ కానుక‌లు చెల్లించ‌వ‌చ్చన్నారు.

అంత‌కు ముందు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బాసర సరస్వతీ అమ్మవారి ని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. మంత్రికి ఆల‌య అర్చ‌కులు, అధికారులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, ఆల‌య ఈవో విజ‌య రామారావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్