Saturday, January 18, 2025
Homeసినిమాఓటీటీలో దూసుకుపోతున్న 'బస్తర్ - ది నక్సల్ స్టోరీ'

ఓటీటీలో దూసుకుపోతున్న ‘బస్తర్ – ది నక్సల్ స్టోరీ’

అదాశర్మ ప్రధానమైన పాత్రను పోషించిన ‘బస్తర్’ .. మార్చి 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. ‘కేరళ స్టోరీ’ కాంబినేషన్లో రూపొందిన సినిమా కావడంతో, విడుదలకు ముందే ఈ సినిమాపై బజ్ పెరిగిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని అంశాలు వివాదం దిశగా వెళ్లాయి. అలాంటి ఈ సినిమా ఈ నెల 17వ తేదీ నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. తొలి రోజు నుంచే ఈ సినిమా వ్యూస్ పరంగా దూసుకుపోతోంది.

ఛత్తీస్ గఢ్ లోని ఒక గ్రామంలో 2010 ప్రాంతంలో జరిగిన నక్సలైట్ల దాడిలో 76 మంది జవాన్లు చనిపోయారు. ఆ సంఘటనను .. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నక్సలైట్స్ కార్యకలాపాలకు తెరదింపడం కోసం ప్రభుత్వం ఐపీఎస్ నీరజా మాధవ్ ను రంగంలోకి దింపుతోంది. నక్సలిజాన్ని అణచివేసే బలమైన సంకల్పంతో ఆమె బరిలోకి దిగుతుంది. ఆ దిశగానే ముందుకు వెళుతుంది. ఈ విషయాన్ని ఎలాంటి రాజీ లేకుండా ఈ సినిమాలో చూపించారు.

ఒక వైపున నక్సలైట్స్ వ్యూహాలను ఎదుర్కుంటూ నీరాజా మాధవ్ ముందుకు వెళుతూ ఉంటుంది. మరో వైపున ఆమె నకిలీ ఎన్ కౌటర్లకు పాల్పడుతోందంటూ కొంతమంది బలమైన వాదనలు వినిపిస్తూ ఉంటారు. ఇలా కథ కొన్ని ఆసక్తికరమైన అంశాలను కలుపుకుంటూ ముందుకు వెళుతూ ఉంటుంది. ఉద్యమం – అణచివేత అనే రెండు కోణాలు కలిగిన ఈ సినిమాలో హింస ఎక్కువగా కనిపిస్తుంది. అందువలన ఆ దృశ్యాలను తట్టుకునేవారు మాత్రమే చూడగలుగుతారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్