Thursday, March 12, 2026
HomeTrending Newsరేపటి నుంచే బతుకమ్మ చీరల పంపీణి

రేపటి నుంచే బతుకమ్మ చీరల పంపీణి

తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపీణి రేపటినంచి ప్రారంభించనున్నట్లు మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ఉధాత్తమైన ఉభయతారక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించినట్టు కెటిఅర్ తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం రేపటి నుంచి (22వ తేదీ) నుండి ప్రారంభం అవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల అద్వర్యం బతుకమ్మ చీరల పంపీణి అవుతుందని మంత్రి కెటిఅర్ తెలిపారు. చీరల పంపీణీ కార్యక్రమం కోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెకర్లతో సమన్వయం చేసుకుంటూ, తమ టెక్స్ టైల్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సంక్షోభంలో చిక్కుకున్న నేతన్నలకు ఒక గొప్ప భరోసా వచ్చిందని.. వారి వేతనాలు రెట్టింపు అయ్యాయని, తద్వరా వారు తమ కాళ్లపైన తాము నిలబడే పరిస్ధితికి చేరుకున్నారని కెటిఅర్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఉపాధి లేక ఆగమైన నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. బతుకమ్మ చీరెల పంపిణీ తో అటు ఆడబిడ్డలకు ఆనందంతో పాటు ఏడాది పొడవునా నేతన్నలకు ఉపాధి భరోసా దొరికిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వత బతుకమ్మ చీరల వంటి వినూత్నమైన కార్యక్రమాలతో నేత కార్మికుల ఒకవైపు అదుకునే ప్రయత్నం చేస్తుంటే, టెక్స్టైల్ ఉత్పత్తులపైన జీఎస్టీ వంటి నిర్ణయాలతో నేతన్నలను నిలువునా ముంచే నేత కార్మికుల వ్యతిరేక చర్యలను కేంద్రం తీసుకుంటుందని కేటీఆర్ అన్నారు. కేంద్రం నేతన్నలను, వారి పరిశ్రమను, వారి జీవితాలను పట్టించుకోకున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేతన్నలకు కోసం తాము నిరంతరం నిబద్దతతో పనిచేస్తామని కేటీఆర్ అన్నారు.

ఇందులో భాగంగా ఈ సంవత్సరం సైతం సూమారు కోటి బతుకమ్మ చీరలను పంపీణి చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది గతంలో కన్నా మరిన్ని ఎక్కువ డిజైన్లు, రంగుల, వైరైటీల్లో ఈ చీరలను తెలంగాణ టెక్స్టైల్ శాఖ తయారు చేసిందన్నారు. గ్రామల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధులు అభిప్రాయాలు, అసక్తులు, నిఫ్ట్ డిజైనర్లలతో సహకారంతో సరైన డిజైన్ లు మరియు అత్యుత్తమ ప్రమాణాలతో ఈ సంవత్సరం బతుకమ్మ చీరల నూతన డిజైనులతో ఉత్పత్తి చేశామన్నారు. ఈ సంవత్సరం (24) విభిన్న డిజైన్లు (10) రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం (240) రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల) తో తయారు చేయబడిన 100% పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలను తమ శాఖ తయారు చేసిందన్నారు. 6 మీట్లర్ల(5.50 + 1.00) మీటర్ల పొడవుగల 92.00 లక్షల సాధారణ చీరలకు అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వయోవృద్ధ మహిళలు ధరించే 9.00 మీటర్లు పొడవు గల చీరలు 8 లక్షలు తయారుచేయించడం జరిగింది. మొత్తంగా కోటి బతుకమ్మ చీరలను రాష్ట్రంలో ఆహార భద్రత కార్డ్ కలిగిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు అందిచనున్నట్లు తెలిపారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన ఉపాది కల్పిస్తున్న ఈ బతుకమ్మ చీరల ప్రాజెక్టు కొరకు మొత్తం రూ. 339.73 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటిదాకా (ఈసంవత్సరం కలుపుకుని) సూమారు 5 కోట్ల 81 లక్షల చీరలను ఆడబిడ్డలకు అయిదు దఫాలుగా అందించామని కెటిఅర్ తెలిపారు.

Also Read: దేశం కేసీఆర్ వైపు చూస్తోంది మంత్రి జగదీశ్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular