Monday, January 20, 2025
HomeTrending Newsతెలుగు విశ్వవిద్యాలయంలో బతుకమ్మ వేడుకలు

తెలుగు విశ్వవిద్యాలయంలో బతుకమ్మ వేడుకలు

వందల సంవత్సరాల నుండి బతుకమ్మ పండుగను కాపాడుకున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని గవర్నర్ తమిళ సై  సౌందర రాజన్ చెప్పారు. హైదరాబాద్ లోని తెలుగు విశ్వ విద్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ కవితతో పాటు విశ్వవిద్యాలయం ఉపకులపతి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్ తమిళ సై  సౌందర రాజన్ ప్రతి రోజు రాజ్ భవన్ లో బతుకమ్మ పండుగ జరుపుకోవడం సంతోషకరమని కవిత హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వం తరుపున ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నానని కవిత అన్నారు. బతుకమ్మ పాటలో ఉండే తెలుగు పదాల మీద పరిశోధన చేస్తే,  తెలుగు బాష మరింత పరిపుష్టం అవుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత అన్నారు. బతుకమ్మ పండుగ అత్యంత ప్రాచీనమైన పండుగ. తెలంగాణ జాగృతితో పాటు, అనేక సంస్థలు బతుకమ్మ పండుగకు సంబంధించి పాత పాటలు సేకరిస్తున్నారని కవిత తెలిపారు.

పాత బతుకమ్మ పాటల్లో ఉండే పదాల మీద ప్రత్యేక అధ్యయనం చేసినట్లైతే, మనం మరచిన తెలుగు పదాలు, తెలంగాణ పదాలు, మళ్లీ బాషలో చేరే అవకాశం ఉంటుందని, దీని మీద మేధావులు మథనం చేస్తే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. బతుకమ్మ పండుగ మీద అనేక మంది పరిశోధనలు జరగాలని కవిత అన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్