బూతులు తిడితే జనాలు వస్తారా అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విపక్షాలపై మండిపడ్డారు.బుడ్డేర్ ఖాన్ గాళ్ళు నోళ్లు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు బతుకమ్మ సందర్భంగా అందిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం సూర్యాపేట నియోజకవర్గంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయా మండల కేంద్రాలలో జరిగిన సభలలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకదాటి మీద నడిపిస్తూ అడిగినా అడగకున్నా అందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రజనాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ఏ ఆడపడుచు కోరలేదు…ఏ ఒక్కరూ అనుకోలేదు…అడిగితే కుడా ఇస్తారని ఎవరూ ఊహించలేదు…ఒక పండుగ జరిగితే ఈ రకంగా బట్టలు పెట్టొచ్చు అనే ఆలోచన ఎలా స్ఫురించింది. పెండ్లికొ, పండుగకో,పబ్బానికో అడపడచులకు బట్టలు పెట్టడం మన సంప్రదాయం. బట్టల కోసం గొడవలు పడే అక్కలను అలిగే చెల్లెళ్లను చూశాం. అటువంటి అడపడచులను తోబుట్టువులుగా,ఇంటి అడపడచులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ భావించి ప్రవేశ పెట్టిందే బతుకమ్మ పండుగకు కానుకగా ఈ చీరల పంపిణీ అని ఆయన వివరించారు.
అంతకు ముందు చాలా ముందు పాలించారు. జిల్లా నుండి ఎందరెందరో యం ఎల్ ఏ లు,యం.పి లు,మంత్రులు అయ్యారు. ఒడ్డు పొడుగును చూసుకుంటూ 20 ఏండ్లు పాలించినం 30 ఏండ్లు పాలించినం అంటూ గొప్పలు చెప్పుకున్నారు.అటువంటి వారెవరికి రాని ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ కే ఎందుకు వచ్చింది అంటే యావత్ తెలంగాణ సమాజాన్ని బిడ్డలుగా తోబుట్టువులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ బావిస్తున్నందునే ఇటువంటి అద్భుతమైన చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని ఆయన తెలిపారు. ఒకప్పుడు ఇక్కడ బతుకమ్మ ఆడాలి అంటేనే భయపడే వాళ్ళం. తెలంగాణ యాసలో పలుకరించాలి అంటేనే వణికి పోయే వారం. మరి ఈ రోజు బాజాప్తాగా మొత్తం ప్రపంచంలోనే ఏ జాతికి లేని అద్భుతమైన అతిగొప్ప మానావియమైన పద్దతిలో జరిగే పండుగ గా…ప్రకృతి ని కొలిచే పండుగగా జరుపుకుంటున్న బతుకమ్మ పండుగకు బట్టలు పెట్టె ఆలోచనకు ప్రతి రూపమే బతుకమ్మ పండుగకు చీరల కానుకగా పంపిణీ మంత్రి జగదీష్ రెడ్డి అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.